Visakhapatnam Narendra Modi Tour: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏపీ పర్యటనకు వస్తున్నారు. ఆయన ఈ నెల 21న విశాఖపట్నంలో అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొననున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ విడుదలైంది. మోదీ భువనేశ్వర్ నుండి విశాఖపట్నం చేరుకుని, తూర్పు నౌకాదళం గెస్ట్ హౌస్‌లో బస చేస్తారు. ఆర్కే బీచ్‌లో ఉదయం 6:30 నుండి 7:45 వరకు జరిగే యోగా కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి దాదాపు 5 లక్షల మంది హాజరవుతారని అంచనా. భద్రతా ఏర్పాట్లు భారీగా చేశారు, ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.