AP Govt Simplify 22a Land Removal Process: ఏపీ ప్రభుత్వం 22ఏ భూముల సమస్య పరిష్కారం దిశగా అడుగులు వేస్తోంది. ఈ మేరకు త్వరలో మాసోత్సవాలు నిర్వహించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆటో ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తించి.. 15 రోజుల్లో తొలగింపు ప్రక్రియ పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఒకవేళ ఆలోపు తొలగించకపోతే.. కారణాలేంటో ప్రస్తావించి తగిన ఆధారాలతో నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మేరకు ప్రభుత్వం త్వరలోనే మార్గదర్శకాలను జారీ చేయనుంది.