ఏపీలో రహదారుల అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సహకారంతో కీలక ప్రాజెక్టులకు మోక్షం కలుగుతోంది. ఇప్పటికే పలుచోట్ల రహదారుల విస్తరణ పనులు వేగం పుంజుకున్నాయి. తాజాగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి.. ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు. రాష్ట్రంలోని అనేక అంశాలపై ఆయనతో చర్చించారు. అలాగే కడప- రాయచోటి రహదారిని నాలుగు వరుసలకు విస్తరించే పనులను ఆమోదం తెలిపాలని.. నిధులు విడుదల చేయాలని కోరారు. మండిపల్లి వినతిపై నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.