Guntur Nandivelugu Road Bridge: రాష్ట్రవ్యాప్తంగా హైవేలు, రోడ్లు, బ్రిడ్జిలు, బైపాస్ రోడ్లపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అలాగే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులపైనా సమీక్షలు చేసి మళ్లీ ప్రారంభించేలా కసరత్తు జరుగుతోంది. తాజాగా కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చొరవతో గుంటూరులో కీలకమైన మరో ఫ్లై ఓవర్ పనులకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది.. రైల్వేశాఖ ఈ పనుల్ని చేపట్టేందుకు ఓకే చెప్పింది. ఈ మేరకు రూ.20 కోట్లు వ్యయాన్ని భరించేందుకు అంగీకారం తెలిపింది.