Darsi Institute Of Driving Training: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకాశం జిల్లా దర్శిలో దేశంలోనే రెండో డ్రైవింగ్, ట్రైనింగ్, రీసెర్చ్ స్కూల్‌ను మళ్లీ పట్టాలెక్కించనుంది. 2016లో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు పిల్లర్ల దశలోనే ఆగిపోయింది. సీఎం ఆదేశాలతో పనులు వేగవంతం కానున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. రూ.18.50 కోట్ల నిధులతో, మారుతీ సుజుకి సహకారంతో ఈ ప్రాజెక్టు పూర్తి కానుంది. త్వరలోనే ఈ ప్రాజెక్టు పనులు పట్టాలెక్కుతాయి అంటున్నారు.