ఏపీలో అదానీ గ్రూప్‌నకు చెందిన అంబుజా సిమెంట్స్.. సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ నెలకొల్పనున్నట్లు సమాచారం. గంగవరం పోర్టులో సిమెంట్ గ్రైండింగ్ యూనిట్ నెలకొల్పేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిసింది. గంగవరం పోర్టులోని ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ప్రత్యేకంగా భూసమీకరణ అవసరం లేకుండా గంగవరం పోర్టులో ఈ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. అలాగే పర్యావరణ హితంగా దీనిని నెలకొల్పనున్నట్లు సమచారం.