ఏపీలో రాజకీయ పరిస్థితులు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇటీవలే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. ఏపీలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయగా.. ఇప్పుడు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కూడా ఏపీలో పర్యటించనున్నారు. ఈమేరకు ఏపీ బీజేపీ ప్రకటన విడుదల చేసింది. అయితే.. జనవరి 18న ఏపీకి రానున్న అమిత్ షా సీఎం చంద్రబాబుతో భేటీ కానున్నారు. తర్వాత రోజు గన్నవరంలో ఏర్పాటు చేసిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగాణాలను ప్రారంభించనున్నారు.