ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికన్ కంపెనీ ఎగ్జాంబిల్ ఆసక్తి చూపుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పాలీఇథిలిన్, పాలీప్రొపలిన్ కంపెనీని ఏర్పాటు చేయనుంది. మరోవైపు విశాఖపట్నంలో టీసీఎస్, లులూ మాల్, కాగ్నిజెంట్ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. కాగ్నిజెంట్ విశాఖలో క్యాంపస్ ఏర్పాటు చేసి 8 వేల మందికి ఉద్యోగాలు కల్పించనుంది. ఇది ఉత్తరాంధ్ర అభివృద్ధికి నిదర్శనమని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు.