New Train Stoppages Srikakulam District: శ్రీకాకుళం జిల్లావాసులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నో రోజుల నుంచి ఉన్న డిమాండ్లను నెరవేరుస్తూ పలు కీలక రైళ్లకు శ్రీకాకుళం జిల్లాలో హాల్ట్ సౌకర్యం కల్పించింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పూరి - అహ్మదాబాద్ ఎక్స్‌ప్రెస్, బెరంపూర్ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్, భువనేశ్వర్ న్యూ విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లకు శ్రీకాకుళం జిల్లాలో హాల్టింగ్ ఇచ్చారు. త్వరలోనే ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.