AP Mango Farmers Rs 172 Crores Alert: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి రైతుల కష్టాలు తీర్చేందుకు అండగా నిలిచింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని తోతాపురి మామిడి రైతులకు కిలోకు రూ.4 చొప్పున అదనంగా చెల్లిస్తామనే హామీని నిలబెట్టుకుంది. ఈ మేరకు రైతుల అకౌంట్‌లలో రూ.172.84 కోట్లు జమ చేసింది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో 37,881 మంది రైతులకు ఈ సాయం అందింది. ఒకవేళ ఆ డబ్బులు ఇంకా బ్యాంక్ అకౌంట్‌లలో జమకాకపోతే రైతులు వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు.