Apsrtc Md On Employees Pending Arrears: త్వరలో రాష్ట్రానికి వెయ్యికిపైగా విద్యుత్తు బస్సులు రానున్నాయని డీజీపీ, ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో 1,500 కొత్త బస్సులు తీసుకున్నామని గుర్తు చేశారు. కొన్ని దూరప్రాంతాలకు నడిపేందుకు డీజిల్ బస్సులు తీసుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. గత సంక్రాంతి సమయంలో భారీగా ఆదాయం సమకూరిందని.. అలాగే ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్ని వచ్చే వారంలో చెల్లిస్తామని ఆర్టీసీ ఎండీ ప్రకటించారు.