ఆంధ్రప్రదేశ్‌లో భవన నిర్మాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఐదు అంతస్తుల వరకూ ఎలాంటి పర్మిషన్ అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే సరిపోతుందని తెలిపారు. అలాగే భవనాలు, లేఅవుట్ల అనుమతుల కోసం మున్సిపాలిటీకి ఫీజు చెల్లిస్తే పర్మిషన్లు మంజూరు చేస్తారని తెలిపారు. ఇక రాజధాని అమరావతి టెండర్ల ప్రక్రియను జనవరి 15లోపు పూర్తి చేస్తామన్న నారాయణ.. అమరావతితో పాటుగా రాష్ట్రంలోని 26 జిల్లాలను ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందన్నారు.