Andhra Pradesh Transport Vehicle Strike December 10: కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పైబడిన వాహనాల ఫిట్‌నెస్ ఛార్జీలను భారీగా పెంచడాన్ని నిరసిస్తూ, సౌత్ ఇండియా మోటార్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్ (SINTA) ఈ నెల 10 నుంచి ఏపీలో సరుకు రవాణా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. రూ.1,340 నుంచి రూ.33,040కి పెంచిన ఛార్జీలు లారీ యజమానులపై భారం మోపుతున్నాయని, పాత ఫీజులనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు బంద్‌కు పిలుపునిచ్చారు.