ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకు టెట్ తప్పనిసరి చేస్తూ సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, 2010కి ముందు నియమితులైన వారు కూడా టెట్ రాసేందుకు పాఠశాల విద్యాశాఖ అవకాశం కల్పించింది. అయితే.. అన్ని సబ్జెక్టులకు సిద్ధం కావడమే అసలైన సవాల్‌గా కొందరు ఉపాధ్యాయులు భావిస్తున్నారు. వీరంతా ప్రస్తుతం పాఠశాలల్లో ఒకే సబ్జెక్టును బోధిస్తున్నారు. ఓవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయాలని ఆలోచిస్తూనే.. మరోవైపు ఆసక్తి ఉన్నవారికి టెట్ రాసే అవకాశం కల్పించింది.