Andhra Pradesh Record Temperatures An Rains: ఏపీలో ఇవాళ విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలతోపాటు 21 మండలాల్లో తీవ్ర వేడిగాలులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరో 7 మండలాల్లో వేడిగాలులు ఉంటాయన్నారు. ఇవాళ రాయలసీమలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాల కురుస్తాయని తెలిపింది. రైతులు, పశువుల కాపరులు చెట్ల కింద నిలబడరాదని సూచించారు. మంగళవారం మార్కాపురం జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడ్డాయి.