మన్యం ప్రాంతాల్లో డోలీ మోతలకు స్వస్తి పలకాలని నిర్ణయించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఆ దిశగా కీలక అడుగులు వేస్తోంది. గిరిజన వాసులకు డోలీ మోతలు తప్పించడానికి కంటైనర్ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద పార్వతీపురం మన్యం జిల్లాలో కంటైనర్ ఆస్పత్రిని అధికారులు ప్రారంభించారు. ఈ విషయాన్ని మంత్రి గుమ్మడి సంధ్యారాణి వెల్లడించారు. సాలూరు మండలంలో ఈ కంటైనర్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. పది గ్రామాల ప్రజలకు ఈ కంటైనర్ ఆస్పత్రి ద్వారా వైద్య సేవలు అందించనున్నారు.