Andhra Pradesh Model Schools Contract Teachers: ఏపీ ప్రభుత్వం మోడల్ స్కూల్స్‌లో కాంట్రాక్ట్ సిబ్బంది సేవలను మరోసారి పొడిగించింది. మోడల్ స్కూల్స్‌లో పనిచేస్తున్న 123 మంది ఫిజికల్ డైరెక్టర్లు, 120 మంది కంప్యూటర్ టీచర్ల సేవలను పునరుద్ధరించింది. ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి 2027 ఏప్రిల్ 30వ తేదీ వరకు 11 నెలల పాటు సేవలకు అనుమతి ఇచ్చింది.. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు.