Bhogapuram International Airport Ready 2026: ఏపీ ప్రజల, ముఖ్యంగా ఉత్తరాంధ్రవాసుల చిరకాల స్వప్నం నెరవేరబోతోంది. విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది జూన్ నాటికి అందుబాటులోకి రానుంది. జీఎంఆర్ సంస్థ ఎల్&టీ ద్వారా శరవేగంగా పనులు పూర్తి చేస్తోంది. విశాఖపట్నం నుండి విమానాశ్రయానికి చేరుకునేందుకు బీచ్ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి అనుబంధంగా 15 అంతర్గత రహదారులను విస్తరించనున్నారు.