Dagadarthi New Airport Land Proposal: ఏపీ ప్రభుత్వం కేంద్రం సహకారంతో రాష్ట్రంలో కొత్త ఎయిర్ పోర్టులు ఏర్పాటు చేసేందుకు అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో కొత్తగా ఏడు ఎయిర్‌పోర్టుల్ని నిర్మించాలని భావిస్తోంది.. ఈ మేరకు కసరత్తు చేస్తోంది. నెల్లూరు జిల్లాలో కొత్త ఎయిర్‌పోర్టుకు సంబంధించి ముందడుగు పడింది.. దగదర్తిలో విమానాశ్రయం ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం భూములకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది.