విజయవాడ సమీపంలో రియల్ ఎస్టేట్ బూమ్ ఊపందుకుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్ వల్ల అక్కడ భూముల ధరలు అమాంతం పెరిగాయి. ఎన్టీఆర్, కృష్ణా, ఏలూరు జిల్లాల్లోని గ్రామాలలో భూముల ధరలు ఇంకా పెరుగుతాయని రియల్టర్లు అంచనా వేస్తున్నారు. మౌలిక వసతులు అభివృద్ధి చెందితే భూముల ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం తర్వాత ఆ ప్రాంతాల్లో ఎలాంటి అభివృద్ధి జరిగిందో, అలాంటి అభివృద్ధే అమరావతి చుట్టు పక్కల జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు.