Chittoor To Thatchur Greenfield Highway 716B: ఏపీలో మరో హైవే అందుబాటులోకి వచ్చింది. చిత్తూరు-తచ్చూరు నయా ఎక్స్‌ప్రెస్ వేలో.. వాహనాల రయ్‌రయ్ అంటూ దూసుకుపోతున్నాయి. ఈ హైవే మొత్తం 116.5 కి.మీ కాగా.. 92 కి.మీ పనులు పూర్తి చేశారు. దీంతో ఈ హైవేలో ప్రయోగాత్మకంగా వాహనాలను అనుమతించారు. ఏపీలో 75 కిమీ అందుబాటులోకి వచ్చింది. ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే రూ.5,488.32 కోట్లతో చేపట్టారు. ఈ హైవే రెండు పోర్టుల్ని కనెక్ట్ చేస్తోంది.