Kattipudi Ongole National Highway 216: అమలాపురం, కాకినాడ వైపు వెళ్లేవారికి ఇక ప్రయాణం సులభతరం కానుంది. కత్తిపూడి-ఒంగోలు జాతీయ రహదారి 216లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో శివకోటి-పాశర్లపూడి మధ్య 20.823 కిలోమీటర్ల రహదారి నిర్మాణం పూర్తయింది. బైపాస్ రోడ్డు ఏర్పాటుతో భూసేకరణలో కొంచెం ఆలస్యమైనా, ఇప్పుడు ప్రయాణికులకు సమయం ఆదా అవుతుంది. మూడు ముఖ్యమైన వంతెనలను కలిపే ఈ హైవేతో కాకినాడకు రెండు గంటల్లోపే చేరుకోవచ్చు.