Chagalamarri Pulivendula 440 National Highway Expansion: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారులు, బైపాస్‌లు, రాష్ట్ర రహదారుల పనుల్ని ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన ప్రాజెక్టులకు సంబంధించిన భూ సేకరణ, నిర్మాణ పనుల్ని వీలైనంత త్వరగా ప్రారంభించే దిశగా అడుగులు వేస్తున్నారు. చాగలమర్రి-పులివెందుల మధ్య నేషనల్ హైవే 440 విస్తరణ పనుల్ని వేగవంతం చేశారు. ఇప్పటికే భూ సేకరణ పూర్తి చేశారు.. నిర్మాణ పనుల్ని కూడా చేపట్టనున్నారు.