Akividu Digamarru 165 National Highway: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆకివీడు-దిగమర్రు జాతీయ రహదారి నిర్మాణానికి నడుం బిగించింది. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు గ్రామాల మీదుగా ఈ రహదారి విస్తరణ జరగనుంది. దీనివల్ల స్థానికంగా రవాణా సౌకర్యం మెరుగుపడటమే కాకుండా, ఆర్థికాభివృద్ధికి కూడా దోహదపడుతుందని భావిస్తున్నారు. ఈ రహదారి పూర్తయితే ప్రాంతీయుల కల నెరవేరుతుంది.