అనకాపల్లిలో నక్కపల్లి క్లస్టర్ రహదారిని విస్తరించనున్నారు. జాతీయ రహదారి 16 నుంచి నక్కపల్లి క్లస్టర్ వరకూ 36 కోట్ల రూపాయలతో రెండు వరుసల రహదారిని నిర్మిస్తున్నారు. అయితే భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఈ రహదారిని నాలుగు వరుసలుగా విస్తరించాలని నిర్ణయించారు. రూ.67.20 కోట్లతో నాలుగు వరుసలుగా విస్తరించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి మంజూరైంది. అలాగే మధురవాడ ఐటీ హిల్‌లో బీటీ రోడ్ నిర్మాణానికి కూడా అనుమతి ఇచ్చారు.