Chipurupalli Rajam New Railway Bridge Ready: విజయనగరం జిల్లా చీపురుపల్లిలో కీలకమైన రైల్వే బ్రిడ్జి పనులు పూర్తయ్యాయి. దీంతో ఉత్తరాంధ్రతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగుపడనుంది. మూడేళ్లుగా వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్న ఈ బ్రిడ్జిని కూటమి ప్రభుత్వం ఏడాదిన్నరలోనే పూర్తి చేసిందని టీడీపీ పేర్కొంది. త్వరలోనే ప్రారంభమయ్యే ఈ బ్రిడ్జి వల్ల ప్రయాణికుల ఇబ్బందులు తీరనున్నాయి. ఆర్టీసీ కూడా మళ్లీ సర్వీసుల్ని నడపనుంది.