Tirupati Gollavanigunta Cricket Stadium: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రాన్ని క్రీడా హబ్‌గా తీర్చిదిద్దడానికి అడుగు లేవస్తోంది. క్రీడా మైదానాలు, మౌలిక సదుపాయాలు కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తోంది. తిరుపతిలో స్మార్ట్‌సిటీ నిధులతో నిర్మించిన క్రికెట్ స్టేడియంను శాప్ స్వాధీనం చేసుకుని క్రీడాకారుల సాధనకు, పోటీలకు అనువుగా తీర్చిదిద్దనున్నారు. అదనంగా సమీకృత క్రీడా సముదాయాన్ని కల్పించడానికి చర్యలు చేపట్టారు. అయితే శాప్ ఛైర్మన్ రవినాయుడు స్పెషల్ రిక్వెస్ట్‌తో ఈ స్టేడియంకు టీటీడీ రూ.కోటి కేటాయించింది.