Guntakal Railway Division Six New Railway Lines: ఏపీలో కొత్త రైలు మార్గాలపై రైల్వే అధికారులు ఫోకస్ పెట్టారు. గుంతకల్లు డివిజన్‌లో ప్రతిపాదించిన రైల్వే లైన్లకు సంబంధించి సర్వేను పూర్తి చేయగా.. ఆ వివరాలను, సమాచారాన్ని పరిశీలించి త్వరలోనే రైల్వేబోర్డుకు నివేదికను పంపిస్తామని అధికారులు తెలిపారు. మొత్తం ఆరు లైన్లకు సంబంధించి ప్రతిపాదనలు ఉన్నాయి. రైల్వేబోర్డు నుంచి ఈ రైలు మార్గాలకు ఆమోదం రాగానే పనులు చేపడతామని అధికారులు చెబుతున్నారు.