Narsipatnam To Tallapalem Road Four Lines Expansion: అనకాపల్లి జిల్లాలో కీలక రహదారి అభివృద్ధికి రంగం సిద్ధమైంది. నర్సీపట్నం-తాళ్లపాలెం మధ్య 32 కిలోమీటర్ల రోడ్డును నాలుగు వరుసల జాతీయ రహదారిగా విస్తరించనున్నారు. ఈ ప్రతిపాదనపై అధికారులు పరిశీలన పూర్తి చేసి, డీపీఆర్‌ను కేంద్రానికి సమర్పించనున్నారు. ఈ విస్తరణతో రవాణా సౌకర్యాలు మెరుగుపడి, వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకుంటాయి. పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతానికి ఈ రోడ్డు ఎంతో ప్రయోజనకరం.