Andhra Pradesh Three New Airports: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో పది పాయింట్ల ప్రణాళికతో విజన్ 2047ను తెరపైకి తెచ్చింది. దీని కోసం మెట్రో రైల్, హైవేలు, పోర్టులు, పర్యాటకం, పరిశ్రమలు, అభివృద్ధి అంశాలపై ఫోకస్ పెట్టారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఎయిర్ కనెక్టివిటీ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. కొత్తగా ఎయిర్పోర్టుల కోసం కసరత్తు చేస్తున్నారు. కేంద్రంతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ మేరకు ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.