Nallapadu Bibinagar Railway Second Line: ఎన్నో ఎళ్ల నుంచి ఎదురు చూస్తున్న నల్లపాడు-బీబీనగర్ రైల్వే ప్రాజెక్టు పనుల్లో స్పీడు పెరిగింది. ఈ మేరకు అధికారులు పనుల్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దాదాపు రూ.1,871 కోట్ల అంచనా వ్యయంతో ఈ పనుల్ని చేపట్టారు. ఈ రైల్వే లైన్ అందుబాటులోకి వస్తే సికింద్రాబాద్‌కు కనెక్టివిటీ పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. బీబీనగర్ (పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, ఎలక్ట్రిక్ పనులపై ప్రధానంగా ఫోకస్ పెట్టారు.