Nandigama Ganesh Idol With Rs 2.7 Crores: ఎన్టీఆర్ జిల్లా నందిగామ వాసవి మార్కెట్లో ఏర్పాటు చేసిన వినాయకుడు చాలా ఖరీదు. అక్కడ వినాయక మండపాన్ని రూ.2 కోట్ల 70 లక్షల కరెన్సీతో అలంకరించారు. వాసవి బజార్లో 42వ గణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని రాజా దర్బార్ గణపతిని ఏర్పాటు చేసి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం రూ.2 కోట్ల 70 లక్షలతో వినాయకుని అందంగా అలంకరించారు. ఈ కరెన్సీ వినాయకుడిని సందర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.