గర్భిణీలకు ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు బాలింతలకు మాత్రమే ఇచ్చే ఎఫ్‌సీఎం ఇంజెక్షన్‌ను ఇక నుంచి గర్భిణీలకు కూడా అందించనున్నట్లు తెలిపింది. ఈ ఎఫ్‌సీఎం ఇంజెక్షన్‌ను పూర్తిగా ఉచితంగా ఇవ్వనున్నట్లు వెల్లడించింది. గర్భధారణ సమయంలో రక్తహీనతతో బాధపడే మహిళలకు ఈ ఇంజెక్షన్‌ను ఇస్తారు. మరోవైపు.. తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలను కూడా తిరిగి అందుబాటులోకి తీసుకువచ్చింది.