జెన్‌జీ యువతను ఆకట్టుకునేలా పోస్టాఫీసులు ఆధునిక రూపు సంతరించుకుంటున్నాయి. జెన్‌జెడ్ థీమ్‌లతో ఢిల్లీ వంటి నగరాల్లో ఇప్పటికే ప్రారంభమైన ఈ పోస్టాఫీసులు.. తాజాగా విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో కూడా ప్రారంభించారు. ఈ జెన్‌జీ పోస్టాఫీస్ డిజిటల్ ఫస్ట్ ఇండియా కోసం ఫాస్ట్, స్మార్ట్, స్టైలిష్‌గా ఉంటుందని పోస్టల్ విభాగం వెల్లడించింది. డిజిటల్ సేవలతో పాటు విద్యార్థులకు ఉచిత వైఫై, లైబ్రరీ వంటి సౌకర్యాలను ఈ పోస్టాఫీసులో అందిస్తున్నారు. త్వరలో గుంటూరు, కర్నూలులో కూడా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.