Ysrcp Candidates Wins Mpp Election: ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల స్థానాలకు ఎన్నికల సందడి కనిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఎంపీపీ, వైస్ ఎంపీపీ పదవులకు ఎన్నిక నిర్వహించారు. కూటమి పార్టీలు కొన్ని పదవుల్ని దక్కించుకుంటే.. అనూహ్యంగా వైఎస్సార్‌సీపీ కొన్ని స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ ఖాతాలోకి వస్తాయనుకున్న చోట వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు గెలిచారు. అలాగే కడప జెడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్‌సీపీకి దక్కింది. రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక కాగా ప్రమాణ స్వీకారం కూడా పూర్తి చేయించారు.