Ap Govt Food Process Units Incentives: ఆంధ్రప్రదేశ్‌లో ఆహార శుద్ధి పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తోంది. పచ్చళ్లు, పిండి వంటలు, పశువుల దాణా పరిశ్రమలకు 35 శాతం రాయితీతో ఆర్థిక సహాయం చేస్తోంది. డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా రూ.40 వేల సాయం అందజేస్తుంది. ఆసక్తి గల ఔత్సాహికులు ఈ నెలాఖరులోపు దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఫుడ్ ప్రొసెసింగ్ సొసైటీ తెలిపింది. మరిన్ని వివరాల కోసం జిల్లా, మండల స్థాయి అధికారులను సంప్రదించవచ్చు.