AP govt appointed former IAS officer Krishnaiah as APPCB Chairman: ఏపీలోని టీడీపీ కూటమి ప్రభుత్వం తొలి నామినేటెడ్ పోస్టును భర్తీ చేసింది. ఏపీ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా పి. కృష్ణయ్యను నియమించింది. దీంతో నామినేటెడ్ పోస్టుల భర్తీని ప్రారంభించినట్లైంది. మరోవైపు కృష్ణయ్య గతంలో ఏపీఐఐసీ ఛైర్మన్ గానూ పనిచేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణయ్య సేవలను కాలుష్య నియంత్రణలో ఉపయోగించుకోవాలని ఏపీ ప్రభుత్వం భావించింది. అందుకే ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.