Andhra Pradesh Livestock Census 2024 Started: ఆంధ్రప్రదేశ్లో పశుగణన ప్రారంభమైంది. నేటి నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. రైతులు తమ పశుసంపదకు సంబంధించిన వివరాలను నమోదు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. మొత్తం 16 రకాల పెంపుడు జంతువుల సమాచారాన్ని సేకరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సిబ్బంది ఈ వివరాలను సేకరిస్తారు. యాప్ ద్వారా వివరాలు సేకరించి.. సర్వే పూర్తైన ఇంటికి స్టికర్లను కూడా అంటిస్తారు.