ఏపీలో ఫస్ట్ స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీ త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఏప్రిల్ నాటికి ఈ ల్యాబ్‌లో కార్యకలాపాలు ప్రారంభించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు. రూ.20 కోట్లతో విశాఖపట్నంలో ఈ ఫుడ్ ల్యాబ్ ఏర్పాటు కానుంది. దీనితో పాటుగా తిరుపతి, గుంటూరు, తిరుమలలోనూ ఫుడ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఆరు నెలల్లోగా వీటిని పూర్తిచేసి, అందుబాటులోకి తేవాలని అధికారులు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపడుతున్నారు. అయితే తిరుమల ల్యాబ్ టీటీడీ తయారు చేసే ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించనుంది.