Andhra Pradesh Quarter Liquor Price Rs 99: ఏపీ ప్రభుత్వం రూ.99కే క్వార్టర్ మద్యం విక్రయిస్తామని ప్రకటించింది. నాలుగు నేషనల్ కంపెనీలు ఆ ధరలో అందించేందుకు సిద్ధంకాగా.. అవి కూడా మరికొన్నిరోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. మరికొన్ని కంపెనీలు కూడా రూ.99కే క్వార్టర్ మద్యం అందించాలని భావిస్తున్నాయట. ఈ నెలాఖరుకు లక్షల కేసులు అందుబాటులోకి రానున్నాయి. తమ బ్రాండ్లను రూ.99కే క్వార్టర్ అందిస్తామని కొన్ని కంపెనీలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.