Markapur New District: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి కొత్త జిల్లాల ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది.. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల అంశంపై కూటమి హామీ ఇచ్చింది. కొన్ని జిల్లాల్లో మార్పులతో పాటుగా.. కొత్త జిల్లాల ఏర్పాటు డిమాండ్ వినిపించింది. తాజాగా కొత్త జిల్లా ఏర్పాటుపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవి, డోలా బాలవీరాంజనేయ స్వామిలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదు నియోజకవర్గాలు కలిపి జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సుముఖంగా ఉందన్నారు.