Andhra Pradesh New District Markapur: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్కాపురంను కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తామని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి ప్రకటించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పశ్చిమ ప్రకాశం ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.1,290 కోట్లతో తాగునీటి ప్రాజెక్టుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా 31 మండలాల్లోని 1,387 గ్రామాలకు తాగునీటి సమస్య పరిష్కారం కానుంది.