Kadapa To Chittoor National Highway 40: ఆంధ్రప్రదేశ్‌లో కడప, చిత్తూరు మధ్య జాతీయ రహదారికి కేంద్రం ఆమోదం తెలిపింది. కర్నూలు నుంచి రాణిపేట వరకు ఉన్న NH-40లో కడప నుంచి రంగంపేట క్రాస్ వరకు 148 కిలోమీటర్ల మేర రోడ్డును నాలుగు వరుసలుగా విస్తరించనున్నారు. వాహనాల రద్దీ తగ్గించి ప్రమాదాలు నివారించడమే లక్ష్యం. ఈ హైవే చెన్నై, వేలూరు, కోయంబత్తూరు, పాండిచ్చేరి వరకు విస్తరించి ఉండటంతో రవాణా మరింత సులభతరం కానుంది. త్వరలోనే ఈ మార్గం నాలుగు లైన్లుగా మారనుంది.