Vakalapudi Annavaram National Highway Four Lines: ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారుల విస్తరణకు ప్రభుత్వం వేగంగా చర్యలు చేపడుతోంది. తాజాగా వాకలపూడి నుండి అన్నవరం వరకు నాలుగు లైన్ల రహదారిని రూ.1,040 కోట్లతో నిర్మించనున్నారు. ఈ రహదారి నిర్మాణానికి టెండర్లు ఆహ్వానించగా, త్వరలో పనులు ప్రారంభించి రెండేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కాకినాడ, విశాఖపట్నం ఓడరేవులకు అనుసంధానంగా ఈ రహదారి ఉండనుంది. గతంలో ఆగిపోయిన అచ్చంపేట-సామర్లకోట రహదారి పనులు కూడా తిరిగి ప్రారంభమయ్యాయి.