Vinukonda To Guntur National Highway 544d Four Lane Dpr: వినుకొండ - గుంటూరుహైవే విస్తరణకు రూ.3,476 కోట్లతో నాలుగు లైన్లుగా విస్తరించనున్నారు. మొత్తం 85.9 కి.మీ.లో.. 41.29 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. ఆరుచోట్ల బైపాస్లు వస్తాయి. ఈ హైవే ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం కాగా.. పీపీపీఏసీకి పంపించనున్నారు. ఈ హైవే కోసం మూడు జిల్లాల్లో భూమిని సేకరించనున్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం రాగానే ఈ ప్రక్రియ మరింత వేగంగా కానుంది.