Kankipadu Gudivada Green Field National Highway: కంకిపాడు-గుడివాడ హైవేను విస్తరించనున్నారు.. ఎంపీ బాలశౌరి విజ్ఞప్తి మేరకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ రూ.600 కోట్లతో నాలుగు వరసల రోడ్డుకు అనుమతి ఇచ్చారు. కంకిపాడు, గుడివాడ మధ్య రోడ్డును నాలుగు వరసలుగా అభివృద్ధి చేస్తారు. త్వరలోనే ఈ రోడ్డు పనులు మొదలవుతాయి. నాలుగు వరసల రోడ్డుతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే కృష్ణా జిల్లాలో మరికొన్ని రోడ్లకు కూడా ప్రతిపాదనలు అందజేశారు ఎంపీ బాలశౌరి.