Visakhapatnam Vande Bharat Tadepalligudem Stop: విజయవాడ-చెన్నై వందేభారత్ రైలు ఇక నరసాపురం వరకు పరుగులు తీస్తోంది. కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ఈ సర్వీసును సోమవారం నాడు ప్రారంభించారు. బ్రాంచ్ లైన్‌లో నడిచే తొలి వందేభారత్ ఇదేనని, భవిష్యత్తులో మరిన్ని రైళ్లు, పొడిగింపులు ఉంటాయని మంత్రి తెలిపారు. నరసాపురం నుంచి వారణాసికి నేరుగా రైలు, గుడివాడకు కొత్త రైళ్లు, మచిలీపట్నం-నాగపట్నం రైలు సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని చెప్పుకొచ్చారు కేంద్రమంత్రి వర్మ.