ఏపీలో మరోసారి మున్సిపల్ ఎన్నికలు... 23 స్థానిక సంస్థలకు నోటిఫికేషన్ షెడ్యూల్ రిలీజ్

1 hour ago 1
ఆంధ్రప్రదేశ్‌‌లో మరోసారి ఎన్నికల నగారా మోగింది. పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మొత్తం 23 స్థానిక సంస్థలకు ఈనెల 26వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. 30వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అవ్వడంతో సంబంధిత పురపాలక ప్రాంతాల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వెంటనే అమల్లోకి వచ్చింది. షెడ్యూల్ ప్రకారం శ్రీకాకుళం, కాకినాడ, రాజమండ్రి, మంగళగిరి - తాడేపల్లి కార్పొరేషన్లలోని 260 డివిజన్లతో పాటు, 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలోని వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
Read Entire Article