ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవించే మహిళల కోసం ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని పునఃప్రారంభించనుంది. గతంలో టీడీపీ ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకాన్ని వైఎస్సార్సీపీ ప్రభుత్వం నాలుగేళ్ల కిందట నిలిపివేసింది. ఇప్పుడు మళ్లీ ప్రారంభించడంతో పేద మహిళలకు, శిశువులకు లబ్ధి చేకూరనుంది. ఒక్కో కిట్‌లో రూ.1410 విలువైన 11 రకాల వస్తువులు ఉంటాయి. ఈ పథకం ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరిగే అవకాశం ఉందని అదికారులు తెలిపారు.