Andhra Pradesh Insurance To Mango Crop: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మామిడి పంటకు బీమా అమలు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.అనంతపురంలో 15%, ఎన్టీఆర్, కాకినాడ, కడప, అన్నమయ్య, విజయనగరం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 16.77%, శ్రీకాకుళం, శ్రీసత్యసాయి, తిరుపతి, తూ.గో జిల్లాల్లో 17.74%, నంద్యాల, అనకాపల్లి, ఏలూరు జిల్లాల్లో 16.08% చొప్పున సగటు ప్రీమియంగా నిర్ణయించారు. రుణాలు తీసుకునే వారితో పాటు లేని వారికీ స్వచ్ఛందంగా బీమా అమలు చేయాలని ఈ మేరకు ప్రభుత్వం ఆదేశించింది.